Breaking News

ఈ నెల 25వ తేదీ జాబ్ డ్రైవ్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వికాస కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ శనివారం జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జె.సునీత బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ లో డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్) ఉద్యోగానికి బి.ఎస్సి కెమిస్ట్రీ, బి.జెడ్.సి, ఎం.పి.సి & సి.బి.జెడ్ గ్రూప్స్ 2017 నుండి 2022 సం||ల్లో ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులు. వీరికి నెలకు రూ.19,477 జీతం + భోజనం, వసతి మరియు రవాణా సౌకర్యం ఉంటుందన్నారు. నిట్ (ఐసీఐసీఐ ) బ్యాంక్ లో రిలేషన్ షిప్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 25 సం||లోపు అభ్యర్థులు అర్హులు. అంతేకాక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కుడా అర్హులు వీరికి సం. రానికి 2.4 నుండి 3.1 లక్షల వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ నెల 25వ తేదీ శనివారం కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద ఉదయం 10.00 గం.లకు సర్టిఫికెట్స్ జెరాక్స్ లతో హాజరు కావలెను. మరిన్ని వివరాలకు 8309010013, www.vikasajobs.com సంప్రదించవలెనని సునీత పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం

-మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల -ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *