Breaking News

ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహం పై దిశా నిర్దేశం

-మత్స్య శాఖ కమిషనర్ కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్
-జిల్లాలో నాన్ ఆక్వా జోన్ పరిధిలో 1025.91 ఎకరాలు గుర్తింపు
-డి ఎల్ సి లో కన్వర్షన్ కోసం ఆమోదించిన 967.94 ఎకరాలు
-తదుపరి సమావేశంలో ఆమోదం తెలపనున్న మరో 57.97 ఎకరాలు
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆక్వా సాగు చేస్తున్నారు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆక్వా జోన్ చెయ్యడం లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. బుధవారం అమరావతి నుంచి మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నాన్ మార్కెటింగ్ వ్యూహ, అందుబాటులో ఉన్న పథకాలపై  జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, దేశీయ చేపల మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.  ఆదిశలో జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నట్లు వివరించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో గుర్తించిన 971.44 ఎకరాల్లో ప్రస్తుతం ఉన్న 967.94 ఎకరాలను జిల్లాలోని నాన్‌ ఆక్వాజోన్‌ నుంచి ఆక్వా జోన్‌గా మార్చేందుకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ఈనెల 6 న నిర్వహించిన సమావేశంలో ఆమోదం తెలిపామని, ఈ-మత్స్యకార్ వెబ్ పోర్టల్‌లో సమర్పించిన 967.94 ఎకరాల (ఫేజ్-1) సర్వే నంబర్ల ప్రతిపాదనలను ప్రభుత్వ మత్స్యశాఖ కమిషనర్‌ ఆమోదం తెలపడం జరిగిందని మాధవీలత తెలిపారు. జిల్లాలో అదనంగా, మండల స్థాయి కమిటీ ఆమోదించిన 57.97 ఎకరాల అనుబంధ విస్తీర్ణం (ఫేజ్-II) ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇంకా ఏమైనా క్రమబద్దకరణకు అర్హమైన భూముల పై మరో సారి నాన్ ఆక్వా జోన్ నుంచి ఆక్వా జోన్ లోకి మార్చే అవకాశం ఉన్న వాటిని గ్రామ సభలు ద్వారా గుర్తించి, మండల పరిధిలోని స్థాయి కమిటి నిర్ణయం తీసుకుని వాటికి కూడా జిల్లా కమిటీకి ప్రతిపాదనలు అందచేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో  జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి, మధురానగర్‌లో రూ.10 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

-‘ఇంటింటికీ తెలుగుదేశం’లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్డులోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *