తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బోయ వాల్మీకి కులాలను షెడ్యూల్డ్ తరగతుల జాబితాలో చేర్చడానికి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏక సభ్య కమిషన్ సమావేశం శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) వారి అధ్యక్షతన నిర్వహించగా తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి , కుల సంఘాల నాయకులు, ప్రజలు , అధికారులు హాజరయ్యారు. శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) మాట్లాడుతూ విమర్శలకు తావు లేకుండా తమ వాదనలను వినిపించాల్సి ఉంటుందని , వినతులను స్వీకరించడం జరుగుతుందని నేడు అధ్యయనం కోసం రావడం జరిగిందని ఇప్పటికే రాయలసీమ ఆరు జిల్లాలలో పర్యటించి నేడు తిరుపతిలో ఏడవ జిల్లా లో అభిప్రాయాలు సేకరించడానికి హాజరయ్యానని, నేటి సాయంత్రం కడప జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశామని రాయలసీమ జిల్లాల పర్యటన ముగుస్తుందని అన్నారు. అనంతరం హాజరైన వివిధ కుల సంఘ నాయకుల నుండి అభిప్రాయాలను సావధానంగా విని రికార్డు చేసుకుని వారి వద్ద నుండి వినతులను స్వీకరించారు. ఎస్టి సంఘ సభ్యులు , నాయకులు ఇతర కులాలను జాబితాలో చేరిస్తే మాకు అన్యాయం జరుగుతుందని ప్రస్తుతమున్న ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్య శాతాన్ని పెంచాలని సూచించారు. బోయ వాల్మీకి సంఘ నాయకులు సభ్యులు వివరిస్తూ రాష్ట్రంలో 8 జిల్లాలలో ఎస్టీలుగా పరిగణింపబడుతున్నామని రాయలసీమ జిల్లాలో బీసీ ఏ. లుగా పరిగణిస్తున్నారని ఒకే రాష్ట్రంలో ఒకే కులానికి రెండు విధాలుగా అమలు చేయడం సరికాదని న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సమావేశంలో ఎస్. సి. సాధికార సంస్థ అధికారి, గిరిజన సంక్షేమ అధికారి చెన్నయ్య, ఎస్. టి. జాబితాలో చేర్చాలని , గతంలో వున్న విధంగా పునరుద్ధరించాలనివాల్మీకి , బోయ సంఘ నాయకులు నాగరాజు, పాపయ్య, బాలయ్య, వెంకటరమణ, అమరనాథ్, విశ్వనాథం, రమణ, కిషోర్, కృష్ణప్ప
ఎస్టి సంఘాల సభ్యులు, నాయకులు ఇప్పటికీ మేము అభివృద్ధికి నోచుకోలేదని మరికొన్ని కులాలను చేరిస్తే అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ల శాతం పెంచి ఆపై చేర్చాలని గుండాల నాయక్, కళావతి, మల్లేష్ నాయక్, అక్కులప్ప నాయక్, వెంకటరమణ తదితరులు తమ అభిప్రాయాలు ఏకసభ్య కమిషన్ ముందు వివరించి వినతులను అందించి శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS (రిటైర్డ్) వారిని సత్కరించారు.
Prajavartha Online Telugu News