కృష్ణాజిల్లాలో వైయస్సార్ లా నేస్తం అర్హులైన 396 మంది జూనియర్ లాయర్లకు 19 లక్షల 30 వేల రూపాయలు

-వైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విడుదల చేశారు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లావ్యాప్తంగా వైయస్సార్ లా నేస్తం అర్హులైన 396 మంది జూనియర్ లాయర్లకు 19 లక్షల 30 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక , జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చీలి. ముసలయ్య, సీనియర్ అడ్వకేట్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు ఎం.డి కరీం తదితరులు పాల్గొన్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్‌ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం వైయస్సార్ లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు.. దాదాపు మూడేళ్ల పాటు.. నెలకు రూ.5,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేల చొప్పున మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం అందిస్తారు.
నాలుగో విడతలో అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్ళలో మొత్తం రూ. 35.40 కోట్లు ఆర్ధిక సాయం అందించారు.
పథకాన్ని అమలు చేసేందుకు, న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్ల కార్పస్‌ఫండ్‌తో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అర్హులైన యువ న్యాయవాదుల్ని గుర్తించి వారికి ఏటా ప్రోత్సాహక నగదు అందిస్తారు.
కోవిడ్‌ నేపధ్యంలో అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌ నుంచి న్యాయవాదుల అత్యవసరాలకు రూ. 25 కోట్ల రుపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు లోన్లు, మేజర్‌ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్‌ వంటి అత్యవసరాలకు ఈ నిధి నుంచి ఆర్ధిక సాయం అందచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించేలా ఏక కాలంలో యువ న్యాయవాదులు పెద్ద మొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడేలా ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి బటన్‌ నొక్కి లబ్ధి అందించేలా పథకంలో మార్పులు చేశారు.
పథకానికి దరఖాస్తు చేసుకోదలచిని వారు https://ysrlawnestham.e-pragati.in/#/వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకుని బ్యాంక్‌ అకౌంట్, ఆధార్‌ నెంబర్‌ను పొందుపరిచి లా డిగ్రీ సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
వైయస్సార్ లా నేస్తం పథకం తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని కొంతమంది యువ న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
మాటూరు మణికంఠ
న్యాయవాద వృత్తి అంటే తనకు చిన్నప్పుడు నుంచి ఎంతో ఇష్టమని, అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా లా చదవడం ఎంతో కష్టమైందని, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన గొప్ప మనసుతో వైయస్సార్ లానేస్తం పథకం తనకు ఎంతగానో ఉపయోగపడిందని, తన చదువుకు ఆ నగదు సహాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు మణికంఠ తెలిపారు.
అద్దంకి సత్య శివ దత్తానంద్
సమాజంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలను చట్టం ద్వారా ఎదుర్కోవాలని సదుద్దేశంతో లా చదివేందుకు ఎంతో ఇష్టపడ్డానని అయితే, ఆశయానికి తగినట్టు ఆర్థిక వనరులు లేకపోవడంతో చదువు మధ్యలోనే వదిలేద్దామని యోచించానని అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువ న్యాయవాదుల కోసం వైయస్సార్ లా నేస్తం పథకం ప్రారంభించడం తనలాంటి వారికి ఎంతో మేలు కలిగించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్ తన ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సహాయం చేసే మనసు ముఖ్యమంత్రిగా ఉంది గనుక తాను ఎంతో అదృష్టవంతుడని దత్తానంద్ అన్నాడు.
జక్కుల పృథ్వీరాజ్
న్యాయవిద్య ఎంతో గొప్పదని అయితే మధ్యతరగతి కుటుంబీకులకు ఆ చదువు ఒకరకంగా అందని ద్రాక్ష వంటిదని పృథ్విరాజ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ లా నేస్తం వంటి గొప్ప పథకం రూపొందించి ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు అండగా నిలబడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పృధ్విరాజ్ చెప్పారు
బచ్చు జాహ్నవి ప్రవల్లిక
తాను మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో 2020 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానని, జూనియర్ లాయర్ గా మరింత ఎదిగేందుకు ఎన్నో ముఖ్యమైన ఖరీదైన పుస్తకాలు అవసరమని జాహ్నవి ప్రవల్లిక తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్సార్ లా నేస్తం పధకం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి తమ పట్ల సానుభూతి చూపి ఈ ఉపకారం చేయడం వల్ల తనలాంటి వారు ఎందరో చదువుకోవడానికి ఉపయోగపడుతుందని సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆమె తెలిపారు.
మల్లవోలు నవ్యశ్రీ
న్యాయం సామాన్యులకు సైతం దక్కాలని ఉద్దేశంతో తాను బిఎల్ చదువుతున్నానని, మధ్యతరగతి కుటుంబం కావడంతో తనకు ఫీజులు చెల్లించడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఈ దశలో వైయస్సార్ లా నేస్తం తనను ఎంతోగానో ఆదుకుందని నవ్యశ్రీ తెలిపింది. చేతి ఖర్చులు, పుస్తకాలకు పెట్రోల్ ఖర్చులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ప్రస్తుతం తాను సంతోషంగా చదువుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఆమె చెప్పారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *