-41 మరియు 42వ డివిజన్ లలోని పలు వీదులలో పర్యటించిన
-పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గo శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ స్థానిక కార్పొరేటర్లు మరియు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో భవానిపురం ప్రాంతములోని 41 మరియు 42 డివిజన్ పరిధిలోని పలు వీధులలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. డివిజన్ నందు ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. డివిజన్ పరిధిలోని ఖాళి స్థలములను ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కులుగా అభివృద్ధి పరచుట జరుగుతుందని అన్నారు. అదే విధంగా డివిజన్ పరిధిలో దర్గా ప్లాంట్ ల యందు అవసరమైన రోడ్ల ఏర్పాటు చేయుటతో పాటుగా మరుగుదొడ్లను కూడా సత్వరమే ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. హెచ్.బి కాలనీ నందలి లోతట్టుగా ఉన్న రోడ్లను మెరక చేసి అభివృద్ధి పరచుట మరియు భవానిపురం రైతు బజార్ రోడ్ విస్తరించుట గల అవకాశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు పడిగిపాటి చైతన్య రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, , బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ అరుణ, శానిటరీ ఇన్స్ పెక్టర్లు సచివాలయ మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News