రూ.165.53 లక్షల అంచనాలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

-నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని  3వ డివిజన్ నందలి పలు ప్రాంతాలలో  రూ.165.53 లక్షల అంచనాలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ వై.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ పలువురు కార్పొరేటర్లతో కలసి అభివృద్ధి పనులను శంఖుస్థాపన చేసినారు. ఈ సందర్భంలో మేయర్  రాయన భాగ్యలక్ష్మి మాట్లాడతూ అభివృద్ధియే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలో అనేక కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని అన్నారు. నేడు రూ. 89.33 లక్షల  నగరపాలక సంస్థ సాధారణ నిదులతో మరియు రూ.76. 20 లక్షల GGMP Grant లతో వెలసి మొత్తం రూ.165.53 లక్షల అంచనాలతో డివిజన్ పరిధిలోని 9 ప్రాంతాలలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించుకోవటం జరిగిందని వివరించారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ కుమారి భిమిశిట్టి ప్రవల్లిక, మెరకనపల్లి మధురి, అంబడిపూడి నిర్మల కుమారి, కో-ఆప్షన్ సభ్యులు యం.సుబ్బారావు,  అధికారులు చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్ మరియు ఇతర అధికారులు స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *