-అధికారులకు పలు ఆదేశాలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను చెల్లింపు దారులు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించునట్లుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బెసెంట్ రోడ్ నందులి 98వ వార్డ్ సచివాలయాని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క పని తీరును మరియు అందుబాటులో ఉన్న రికార్డ్ లను పరిశీలించి పలు ఆదేశాలు ఇచ్చారు. 23వ డివిజన్ పరిధిలోని 93, 97, 98 మరియు 25వ డివిజన్ పరిధిలోని 94, 95 & 96 వ అడ్మిన్ లతో మరియు రెవిన్యూ అధికారులతో సమీక్షించి పన్ను వసూలు విధానము అడిగి తెలుసుకొన్నారు. పన్ను చెల్లింపు దారులు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించునట్లుగా ప్రజలకు అవగాహన కల్పించి మార్చ్ నెలాఖరు లోపు వడ్డీ లేకుండా పన్నులు చెల్లించునట్లుగా పన్ను చెల్లింపు దారులను చైతన్యపరచునట్లుగా చర్యలు చేపట్టి ప్రాపర్టీ టాక్స్, వాటర్, సేవేర్జ్ మరియు ఖాళి స్థలముల పన్ను వసూళ్ళు శాతాన్ని పెంచాలని ఆదేశించారు. పన్నులు సకాలంలో చెల్లించని వారిపై తగిన చర్యలు తీసుకోని సకాలంలో పన్నులు చెల్లించునట్లుగా చూడాలని సూచించారు. అదే విధంగా 100 శతం డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయునట్లుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనసూయ దేవి, జోనల్ కమిషనర్ సృజన మరియు సచివాలయ వార్డ్ అడ్మిన్ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News