-సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్దిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయండి…
-బ్యాంకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్దిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేసి అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపండంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా జాయింట్ నుపూర్ అజయ్ బ్యాంకు అధికారులను కోరారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బుధవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ (డిసిసి) డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూకమిటి ( డిఎల్‌ఆర్‌సి ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్థేశించిన బుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు గాను రూ. 16,628 కోట్ల రుణలక్ష్యంకాగా రూ. 14,154 కోట్ల రుణాలు మంజూరు చేసి 85.12 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ప్రాథాన్యేతర రంగాలకు అదనంగా రూ. 10,144 కోట్ల లక్ష్యానికి గాను రూ.27,021 కోట్ల రుణాలు అందజేసి 266.37 శాతం పురోగతి సాధించామన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పంట రుణాల కింద ఖరీఫ్ సీజన్‌లో రూ. 5,515 కోట్ల రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 4,310 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని రబీ సీజన్‌లో 4,234 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2,668 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పంట రూణాలు కింద ఏడాది మొత్తం 9749 కోట్ల రూపాయల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 6978 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఎస్.ఎం.ఇ.సెక్టార్‌కు సంబంధించి రూ. 4,770 కోట్ల లక్ష్యం కాగా రూ.6,533 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమలకు 2,832 కోట్ల రూపాయలు, చిన్న పరిశ్రమలకు 2,294 కోట్ల రూపాయలు, మధ్య తరహ పరిశ్రమలకు 1,407 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇతర ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ. 2,108 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ. 643 కోట్ల రుణాలు అందజేసి 30.05 శాతం ప్రగతి సాధించడం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ పి కోటేశ్వరరావు వివరించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలు ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారులకు బుణాలు అందించి జిల్లా ప్రగతికి సహకరిస్తున్న బ్యాంకర్లను అభినందిస్తున్నామన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందుకు సంబంధించి అన్ని బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు తక్షణమే రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను జాయింట్ కలెక్టర్ కోరారు. గ్రామ సచివాలయాలు ఆర్‌బికెల పరిధిలో బ్యాంకు లావాదేవిల సేవలను మరింత విసృతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో బ్యాంకు అధికారులు ప్రత్యక క్యాంపులు నిర్వహించి పొదుపు ఖాతాల నిర్వహణపై అవగాన కల్పించాలన్నారు. అర్హత ఉన్న యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లబ్ది చేకూర్చేలా రుణాలను మంజూరు చేయాలన్నారు. లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బ్యాంకులకు, సంబంధించిన అధికారులు అందుకు గల కారణాలను తెలియజేయాలన్నారు. జగనన్న తోడు, పియం స్వానిధి, టిట్కో గృహ నిర్మాణాల లబ్దిదారులకు రుణాలను మంజూరు చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ బ్యాంకు అధికారులకు సూచించారు.
ఏపి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మట్లాడుతూ చిరు వ్యాపారులకు, వడ్డీ వ్యాపారస్తుల నుండి రక్షణ కల్పించే జగనన్న తోడు పథకానికి, రుణాలు మంజూరు చేయడంలో కొన్ని బ్యాంకులు లబ్దిదారులను ఇబ్బందులు గురిచేస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోనే పెండిరగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉందని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి అన్నారు. జగనన్న తోడు లబ్దిదారులకు రుణాల పంపిణీ మేళాను నిర్వహించి అర్హత కలిగిన లబ్దిదారులకు జగనన్న తోడు పథకాన్ని మంజూరు చేయాలని కోరారు. నగర పాలక సంస్థ పరిధిలో ధరఖాస్తులు బ్యాంకుల వద్ద పెండిరగ్‌లో ఉన్నాయని, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే లబ్దిదారులకు కూడా రెండవ విడతలో బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేయకుండా మంజూరు చేయాలని శాసనసభ్యులు మల్లాధివిష్ణువర్థన్ కోరారు.
సమావేశంలో కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజనల్ హెడ్ యువి రజనీకాంతారావు, ఆర్‌బిఐ ఏజియం యంజడ్ రెహమాన్, నాబార్డ్ డిజియం మిళ్లింద్ చౌల్సాకర్, ఎల్‌డియం పి కోటేశ్వరరావు, బ్యాంక్ కంట్రోలింగ్ అధికారులు, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ శకుంతల, టిట్కో ప్రాజెక్టు ఆఫీసర్ చిన్నోడు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News