గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్తి గ్రామంలోని శాంతిపాలెంలో సుబాని ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్‌సిపి మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ పాల్గొని అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ భారతరత్న పురస్కార గ్రహీత, స్వతంత్ర భారత తొలి విద్యామంత్రిగా ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రారంభించిన మౌలానా నేషనల్ ఫెలోషిప్ మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడేదన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీనిని రద్దు చేయడంతో ముస్లింలు, అన్ని మైనార్టీలవర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మౌలానా నేషనల్ ఫెలోషిప్ పథకాన్ని పునరుద్ధరించేలా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జమీల్ అహ్మద్ బేగ్ అధికార ప్రతిపక్ష నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో సుభాని, బాజ్‌మూన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News