విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మా గాంధీ సతీమణి కస్తూరి బాయి 79వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ లో గల “గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమం” నిర్వాహకులు గాంధీ నాగరాజన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుధవారం కస్తూరి బాయి చిత్రపటానికి నాగరాజన్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవిత భాగస్వామి కస్తూరి బాయి గాంధీజీకి అండగా నిలిచారని కొనియాడారు. కస్తూరి బాయి జీవితం ఆదర్శప్రాయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం ఆశ్రమం అనుచరులు, బంగారు భారతి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News