ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా ఘాట్లో ఈతల పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, కార్యదర్శి మందపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 26 న రివర్ క్రాస్ ఈతల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ దుర్గఘట్ నుండి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న లోటస్ ఫుడ్ సిటీ వరకు 1.5 కిమి మేర ఈ పోటీలు జరుగుతాయని తెలియచేశారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు కేటగిరి 1, 19 నుండి 30 సంవత్సరాల వరకు కేటగిరి 2, 31 నుండి 45 సంవత్సరాల వరకు కేటగిరి 3, 46 నుండి 60 సంవత్సరాల వరకు కేటగిరి 4, 65 సంవత్సరాల పైబడి కేటగిరి 5 విభాగాలలో ఈ పోటీలు వుంటాయని చెప్పారు. విజేతలకు బహుమతులతో పాటు, సర్టిఫికెట్స్ అందచేయబడుతాయని పేర్కొన్నారు. ఈ నెల 18 నుండి 24 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ పోటీలు నిర్వహిస్తూనామాన్ని పేర్కొన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని వారు వెల్లడించారు. తొలుత కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *