రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులకు “RMC CUP-2023” పేరిట ఆటల పోటీలు ఏర్పాటు చేయడమైనదని నగరపాలక సంస్థ కమిషనరు కె. దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ది.24-02-2023 ఉదయం గం.9.00లకు ఆర్ట్స్ కాలేజీ అద్లేటిక్ (గ్రౌండ్) నందు ప్రారంభోత్సవ కార్యక్రమము ఏర్పాటు చేయడమైనదన్నారు. క్రికెట్, వాలీబాల్, థ్రౌబల్ల్, కబడ్డీ, రన్నింగ్, షాట్ పుట్, జావలిన్ త్రో, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు మహిళలకు, పురుషులకు విడిగా ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమములు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఇతర జిల్లా అధికారులు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొంటారు. ముందుగా క్రీడాకారులచే మార్చ్ ఫాస్ట్ ఏర్పాటు చేయడమైనది. కావున, ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమము జయప్రదము చేయవలసినదిగా కొరడమైనది.
Prajavartha Online Telugu News