రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకు లింకేజీ ఋణాలు జీవనోపాధి అభివృద్ధి కొరకు సద్వినియోగం చేసుకోవాలని, తిరిగి చెల్లింపులు చెయ్యడం ద్వారా మరిన్ని రుణాలు మంజూరు చేయడం సాధ్యం అవుతుందని డిఆర్డిఎ పధక సంచాలకులు ఎస్.సుభాషిణి పేర్కొన్నారు. గురువారం రాజానగరం మండలం, శ్రీరాంపురం గ్రామం లో స్వర్ణ స్వయం సహాయక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ PRRD వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సంఘాలు తీసుకుంటున్న బ్యాంకు లింకేజీ ఋణాలు జీవనోపాధి అభివృద్ధి కొరకు ఏ రకంగా వాడుతున్నారు (క్రెడిట్ వినియోగం మరియు నగదు ప్రవాహ అధ్యయనం లో) భాగంగా మరియు ఏ విధంగా తిరిగి రికవరీ బ్యాంకులకు కడుతున్నారు అనే దానిపై అధ్యయనం మరియు వారికి ఏ విధమైన మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి అనే అంశం పై ప్రాజెక్టు డైరెక్టర్ .సుభాషిణి రాజానగరం మండలం, శ్రీరాంపురం గ్రామం లో స్వర్ణ స్వయం సహాయక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. సంఘం యొక్క పనితీరు అంతర్గత అప్పులు నిర్వహణ,పుస్తకాలు నిర్వహణ పరిశీలించారు. మరియు లోన్ తీసుకుని సభ్యులు, కుటుంబ సభ్యులు చేస్తున్న జీవనోపాధి కార్యక్రమాల్ని( ఆవులు,టెంట్ హౌస్,జీడిమామిడి,నిమ్మ తోటలు) సందర్శించడం జరిగింది. ఈ సమావేశానికి బ్యాంకు లింకేజీ డీపీఎం గణేష్, ఎపిఎం హేమ నాగలక్ష్మి , సిసి కన్నబాబు, సిసిఎల్సి సింహాచలం, అకౌంటెంట్ నాని, గ్రామ సంఘం సహాయకులు రాజ్యలక్ష్మి హాజరయ్యారు
Prajavartha Online Telugu News