తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య అధికారులు సూచించిన మేరకు రక్తహీనత గల గర్భవతులకు సరైన పోషికాహారం అందించి , వాడే విధంగా అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో అమరావతి నుండి వైద్య ఆరోగ్య , మహిళా శిశు సంక్షేమ శాఖల కార్యక్రమాల అంశాలపై సమీక్ష నిర్వహించగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ … ఆయుష్ మాన్ భారత్ నమోదు పై దృష్టి పెట్టాలి, 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో హైరిస్క్ గర్భవతులు మాడరెట్ 335 మంది, ముగ్గురు సివియర్ నమోదు వుందని, సరైన పౌష్టకాహారం అందించి , ఆ పౌష్టకాహారాన్ని వాడేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రసవ సమయానికి 7 రోజుల ముందే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకెల్లి, అడ్మిట్ చేయాలని అన్నారు. ప్రభుత్వ , నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికత్స పొందిన వారి వద్ద అందిన వైద్య సేవలపై అభిప్రాయం సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ అమలవుతున్న విధానంపై అందిస్తున్న మందులు సమీక్ష నిర్వహించారు. ఆరు సంవత్సరాల వయస్సు ఎత్తు, బరువు తక్కువ పిల్లలు 10 వేలు వున్నారని వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని బాలామృతం సక్రమంగా అందాలని అన్నారు. హాస్టల్స్ , పాఠశాలలో వున్న విద్యార్థుల కు రక్తహీనత లేకుండా పరీక్షలు, పోషకాహార అందించాల న్నారు. మైనర్ వయస్సు గల గర్భవతులు నమోదు అవుతున్నారని, అవగాహన కల్పించి బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను , వారికి కలిగే ఆనారోగ్య సమస్యలు తెలియజేయాలని అన్నారు. సుస్థిర అభవృద్ధి లక్ష్యాలు సాధనపై దృష్టి పెట్టాలని అన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదు శాతం పెరగాలని , ఆధార్ పొంది 10 సంవత్సరాలు అయిన వారు అప్ డేట్ కోసం ఈ నెల 27, 28 ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు కావాలని అన్నారు. సచివాలయంలో పౌర సేవలు ఆలస్యం లేకుండా అందించాలని , ప్రతి అర్జి నిర్ణీత సమయం లోపు పరిష్కరించాలని అన్నారు. బడి బయటి పిల్లల ను గుర్తించి పాఠశాలలో చేరేవిధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ప్రభావతి, డి ఎల్ డి ఓ సుశీల దేవి, ఐసి డి ఎస్ పిడి జయలక్ష్మి , డి ఐ ఓ శాంత కుమారి, ఎస్ సి వెల్ఫేర్ ఆఫీసర్ చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News