గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అడ్వర్టైజింగ్ బోర్డ్లు, హోర్డింగ్ ఏజన్సీల నుండి మీడియా డివైజ్ డిస్ప్లే ఛార్జీల బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసి, ఏ.సి.పి., టి.పి.ఎస్.లకు భాద్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సిటి ప్లానర్ ని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మీడియా డివైజ్ ఫీజుల వసూళ్ల వేగవంతం చేయాలని, బకాయిల వసూళ్ళపై పట్టణ ప్రణాళిక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఫీజులు చెల్లించని వారి బోర్డ్ లను తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే బోర్డ్ లకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని, ప్రతి బోర్డ్ కు జియోట్యాగ్ ల ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడానికి ప్రాసెస్ చేయాలని, ముందుగా ఆధార్ వ్యాలిడేషన్ చేయాలని ఆదేశించారు. విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణం జరిగిన చోట విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని సిపిడిసిఎల్ ఈ.ఈ.ని ఆదేశించారు. సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, రీ సర్వే వేగవంతంకు చర్యలు తెసుకోవాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. విభాగ కోర్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని, కౌంటర్స్, ప్యార వైజ్ రిమార్క్స్ పక్కాగా నిర్దేశిత గడువులోగా కోర్ట్ కు పంపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించినా, బ్యానర్స్ కట్టినా పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణలో పెండింగ్ పనులు వేగవంతం చేయాలని, నూతనంగా విస్తరణ పనులు చేపట్టే ప్రాంతాల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. రోడ్ విస్తరణ ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, సూపరిండేంట్ ప్రసాద్, టి.పి.ఎస్.లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News