పేదలకు అండగా దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ నాయకులకు సేవే పరమావధి కావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలో ని 3వ డివిజన్,కరెన్సీ నగర్, విజయనగర కాలనీ,లూర్ద్ నగర్ కి చెంది నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1,00,000/-రూపాయల విలువ గల 2 ఇస్త్రీ బండ్లు,2తోపుడు బండ్లు,1టిఫిన్ బండ్లను అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు గా నేను కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వైస్సార్సీపీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు,విస్తృతంగా సేవ కార్యక్రమలు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్,నగర మేయర్ రాయన భగ్యలక్ష్మి,డిప్యూటీ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,3వ డివిజన్ కార్పొరేటర్ భమిశెట్టి ప్రవల్లిక,ముసునూరు సుబ్బారావు,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *