విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొరివి చైతన్య (యువజన విభాగం), చిమటా సాంబశివరావు (ట్రేడ్ యూనియన్), కావాటి దామోదర్ (సేవదల్ విభాగం), దొడ్డ అంజిరెడ్డి (విద్యార్థి విభాగం) ఈరోజు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి దేవినేని అవినాష్ మర్యాదపూర్వకంగా కలువగా వారిని సత్కరించి ఇచ్చిన బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు,కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News