Breaking News

విషప్రచారం త్రిప్పికొట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈనాడు పత్రిక, రామోజీరావు లు విష ప్రచారం చేయడం తగదని, పార్టీ శ్రేణులు ఆ ప్రచారాన్ని గట్టిగా త్రిప్పి కొట్టాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. గురువారం శిఖమణి సెంటర్లో పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి ఈనాడు పత్రికలు తగలబెటారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను అందించే బాధ్యతాయుతమైన రంగం పత్రిక రంగం అని, అలాంటింది బాధ్యత మరచి ఒక పార్టీకి కొమ్ముకాసేలా ఈనాడు విషపు రాతలు రాయడం సిగ్గుచేటు అని విమర్శించారు. పట్టాభి విషయంలో గతంలో జరిగిన సంఘటన తాలుకా ఫోటోలు వేసి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయలని చూశారని పార్టీ సోషల్ మీడియా శ్రేణులు వాస్తవాలు ప్రచారం చేసేసరికి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. మరలా ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఎన్టీఆర్ జిల్లా యూత్ అధ్యక్షులు కొరివి చైతన్య మరియు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇంఛార్జీలు, వైస్సార్సీపీ నాయకులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి!

-ఎన్నికల విధానంలో, ప్రజాస్వామ్య విధానాల అమలులో మార్పు రావాలి!! -నగర సమగ్రాభివృధికి 50 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి!!! …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *