Breaking News

‘‘కనెక్ట్‌ టు ఆంధ్రా’’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధునిక మౌలిక వసతుల కల్పనకు ‘‘కనెక్ట్‌ టు ఆంధ్రా’’ ద్వారా లారస్‌ లాబ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లాలోని కంచికచర్ల మండలం మెగులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అత్యధునిక మౌలిక వసతులను కల్పించి మోడల్‌ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన లారస్‌ లాబ్స్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావ నరసింహరావు, ‘‘కనెక్ట్‌ టు ఆంధ్రా’’ సిఇవో కోట్ల శివశంకర్‌ తో కలెక్టర్‌ డిల్లీరావు గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. లారస్‌ లాబ్స్‌ లిమిటెడ్‌ సామాజిక భాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు `నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుప్రతులలో ఆధునిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలలో భాగస్వామ్యులు అయ్యే విధంగా దాతలు, సిఎస్‌ఆర్‌ నిధులతో కనెక్ట్‌ టు ఆంధ్రా ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా లారస్‌ లాబ్స్‌ లిమిటెడ్‌ సంస్థ తమ వంతు సహకారం అందించడం పట్ల కలెక్టర్‌ డిల్లీరావు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కనెక్ట్‌ టు ఆంధ్రా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ వినియోగం

-విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *