స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు చెందిన అనుబంధ పోస్టుల భర్తీకి చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో మహిళల, పిల్లల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ సుస్థిర లక్షల కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు చెందిన అనుబంధ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి, తదితర ఉన్నతాధికారులచే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పౌర సేవలు, జీ జీ ఎం పి పనులు, మహిళా స్త్రీ సంక్షేమం తదితర అంశాలపై అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు 13, అంగన్వాడీ సహాయకుల పోస్టులు 14 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 8571 పైగా గర్భిణీ స్త్రీలు ఉండగా వారిలో రక్త హీనత గల 1645 మందిని గుర్తించడం జరిగిందని, వారిలో ప్రభుత్వ పరంగా సేవలు పొందేందుకు 1634 మంది సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. కొద్ది పాటి లక్షణాలు ఉన్నవారు 1429, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 216 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం పరంగా అవసరమైన ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తక్కువ బరువు ఉన్న పిల్లలు 3281 మంది, కుంగి పోయిన వారు 5570  మంది ఉండగా వారిలో 6776 మందికి వైయస్ఆర్ ప్రత్యేక పౌష్టి కాహరం అందిస్తున్నట్లు తెలిపారు.

0-6 సం.ముల పిల్లలు 96704 మంది ఉండగా వాటిలో 51857 మంది ఆధార్ నవీకరణ చెయ్యడం జరిగిందని మాధవీలత తెలిపారు. 86447 మంది పిల్లల ఎదుగుదల కు సంబంధించి 84,806 మంది పిల్లల ఎదుగుదల పై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

రైస్, కందిపప్పు, పామోయిల్, పౌష్టికాహర కిట్స్, బాలమృతం, పాలు జనవరిలో దాదాపు 100 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందని, ఫిబ్రవరి లో  ఆయిల్, న్యూట్రీషన్, పాలు, బాలమృతం  70-80 శాతం పైగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

పౌర సేవలకు సంబంధించి పెన్షన్ కానుక కింద 566 దరఖాస్తులు, ఇంటి స్థలం కోసం 20, రేషన్ కార్డులు కోసం 1789, సమీకృత ధ్రువపత్రాలు కోసం 2112, ఆదాయ దృవపత్రలకు 1488,  మ్యూటేషన్ కోసం 786 దరఖాస్తులు రాగా అన్ని దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క దరఖాస్తు, ఆర్జీ లను వొచ్చిన 24 గంటల్లో తప్పనిసరిగా అధికారులు పరిశీలన చెయ్యడం పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం తో పాటు, వాటికి సానుకూల పరిష్కారం హేతు బద్దత ఉండడం పై సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తున్నట్లు తెలిపారు.

జి జి ఎం పి కింద 1071 సమస్యలు గుర్తించగలిగితే వాటిలో 1030 కి సంబంధించి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని మిగిలినవి పరిశీలన దశలో ఉన్నట్లు పేర్కొన్నారు.

6వ విడత జగనన్న తోడు కింద పట్టణ పరిధిలో  4369 , గ్రామీణ ప్రాంతాల్లో 19078 మంది లబ్ధిదారల లక్ష్యం దిశగా కార్యాచరణ అమలు చేయడం జరుగుతున్నట్లు మాధవీలత అన్నారు . జిల్లాలో 77 ఆధార్ నమోదు కేంద్రాలలో 58 ఆధార్ నవీకరణ చేపట్టడం జరుగు తున్నట్లు పేర్కొన్నారు.

118 గ్రామవాలంటీర్,  15 పట్టణ వాలంటీర్ పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి అని తెలియచేసారు.

512 గ్రామ వార్డ్ సచివాలయలలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు 79108 సేవలు, ఫిబ్రవరి 9  నుంచి 21 వరకు 57602 సేవలు అందిస్తున్నా మన్నారు . సగటున  113 సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవడం జరిగిందనీ అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీపీఓ కె.ప్రకాష్ రావు,  డి ఎమ్ హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు, , ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి కే. జ్యోతి, డిఎల్డిఒ పి. వీణా దేవి, వి.శాంత మణి, ఆర్డబ్యూ ఎస్. ఈ డి.బాల. శంకర్ రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా పి ప్రియాంక, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా వసుంధర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *