విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం జగన్ ఆదేశాల మేరకు స్మృతివనం పనులు పరిశీలనలో విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పాల్గొన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ నేడు అధికారులతో కలిసి స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకముగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనము మరియు 128 అడుగుల కాంశ్య విగ్రహ ఏర్పాటు పనులను పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశములు ఇచ్చియున్నారు. ఈ సందర్భములో జరుగుచున్న నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు.అదేవిధముగా ముఖ్య మంత్రి ఆదేశముల ప్రకారం నిర్నీత గడువు లోపుగా అన్ని అభివృద్ది పనులను పూర్తి చేయాలని, అవసరమైనచో అధనముగా పనిచేసే వారిని ఏర్పాటు చేసుకుని,రాత్రి వేళలలో కూడా పనులు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఫ్లోరింగ్ కొరకు ఉంచిన గ్రానైట్ డిసైన్స్ ను పరిశీలించారు. రాబోవు రెండు రోజులలో విగ్రహం బూట్ల పార్టులను నిలపెట్టుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో క్వాలిటీ కంట్రోల్ పాండు రంగారావు, ఏపీ.ఐ.ఐ.సీ. అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు ఉన్నారు
Prajavartha Online Telugu News