Breaking News

ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

-డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి: ఎస్పీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రగ్స్ వాడకం సామాజిక, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై అత్యంత చెడు ప్రభావం చూపుతోందని, ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువత పెడదారి పట్టరాదని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అవగాహన ర్యాలీని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి బాలాజీ కాలనీ వరకు సే నో టు డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ పైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపుతోందని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిని గుర్తించి రిహాబిలేషన్ సెంటర్లో చికిత్సను అందించి వారిని కాపాడాలని అన్నారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని ఇలాంటి సమయంలో జిల్లా ఎస్పీ గారు సబ్ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించడం సంతోషమని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు.

జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ ఇటీవల కాలంలో ప్రపంచం తో పాటు అన్ని దేశాలలో పెనుభూతంగా మారిందని, చాలామంది కార్మికులు , యువత డ్రగ్స్ వైపు మల్లడం, తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా మద్యం మత్తులోఅవాంఛనీయ సంఘటనలకు దారితీస్తున్నారని అన్నారు. డ్రగ్స్, గాంజా వంటి వాటిపై పోలీస్ , సెబ్ నిఘా ఉంచామని నియంత్రణకు కృషి చేస్తున్నామని అన్నారు. మద్యం మత్తులో ఏమిచేస్తున్నారో తెలియక నిన్న నెల్లూరు 6 ఏళ్ల అమ్మాయి సంఘటన చూశామని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని చెడు దారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. విద్యాలయాలలో యాంటీ డ్రగ్ ఇన్స్టిట్యూషన్స్ కమిటీలు ఏర్పాటు చేశామని సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా డ్రగ్స్ సమాచారాన్ని పోలీసు వారికి కానీ సెబ్ అధికారులకు కానీ అందించాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నడుం బిగించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సెబ్ అదనపు ఎస్. పి. రాజేంద్ర, జిల్లా అదనపు ఎస్. పి .అడ్మిన్ వెంకటరావు, సెబ్ ఇ.ఎస్. డాక్టర్ స్వాతి , ఏ. ఈ. ఎస్. శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కళాశాల ల విద్యార్థులు, పోలీస్ , సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం

-మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల -ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *