Breaking News

రాజమహేంద్రవరం ఘనంగా ప్రారంభం అయిన “ఆర్ ఎం సి కప్ -2023”

-మూడు రోజుల పాటు క్రీడా పోటీలు – ఆర్ట్స్ కాలేజీ అద్లేటిక్ (గ్రౌండ్)లో
-క్రీడాజ్యోతి తో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి నగరపాలక సంస్థ ఉద్యోగులు
-జిల్లా కలెక్టర్ డా.కె మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు శారీరక ఆరోగ్యానికి మానసిక వికాసానికి, విధుల్లో వత్తిడిని అధిగమించేందుకు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో “ఆర్ఎంసికప్ – 2023” క్రీడలను కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధిలో శానిటేషన్ వాటర్ సప్లై,టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, హెల్త్, పరిపాలన వంటి వివిధ విభాగంకు సంబంధించి సుమారు 6 వేల మంది ఉద్యోగులు నిత్యం ఎంతో వత్తిడి మధ్య విధులను నిర్వర్తించడం జరుగుతోందని అన్నారు. వత్తిడి మధ్య పనిచేసే వారికి ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా మరింత నిబద్దత తో , చురుగ్గా పని చేయగలరని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగుల దినసరి కార్యక్రమంలో ఎంతో ట్రెస్ తో పనిచేస్తారని, వారికి రిలీఫ్ ఇవ్వడంతోపాటు మరింత సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇటువంటి క్రీడలు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు.
కార్పొరేషన్ పరిధిలో ఉదయం శానిటేషన్ మొదలు రాత్రి శానిటేషన్ వరకు నగరంలో పారిశుధ్య పనులు ఎంతో చక్కగా చేపట్టి, వారు సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నా రన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 50 శాతం మున్సిపల్ కార్పొరేషన్ మంచి రిజల్ట్స్ తీసుకొస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో తమ విధులు పట్ల మంచి ఉత్సాహాన్ని నింపేందుకు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ RMC -2023 పేరున క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే వేడుకల లో పోలీసు అధికారులు సిబ్బంది ఎంతో క్రమశిక్షణా పొంది మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తారని, దానికి సరిసమానంగా మునిసిపల్ సిబ్బంది అదే తరహాలో నేడు ఆర్ఎంసి కప్ మార్చ్ ఫాస్ట్ కూడా చేయడం అభినందనీయ మన్నారు. నగరపాలక సంస్థలలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులు ఈ క్రీడల్లో పాల్గొనడం వారి క్రీడా స్ఫూర్తి కి నిదర్శనం అన్నారు. ఆరోగ్యవంతమైన ఈ క్రీడా పోటీల్లో చక్కగా పాల్గొని మూడు రోజులు పాటు నిర్వహించే ఈ క్రీడలను విజయం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 24/7 తమ విధుల్లో పనిచేస్తుంటారన్నారు. మూడు రోజులు పాటు నిర్వహించే RMC CUP – 2023 క్రీడా పోటీలు వారిలో ఉన్న ట్రెస్ ను తగ్గించి ఉద్యోగులు సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ క్రీడా పోటీలు 26వ తేదీ ఆదివారంతో ముగుస్తాయని తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో నగరపాలక సంస్థ వివిధ విభాగాల నుంచి 523 మంది పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ జండా ఊపి 100 మీటర్స్ రన్నింగ్ క్రీడను ప్రారంభించారు.

RMC CUP 2023 వివరాలు :-

ఫిబ్రవరి 24వ తేదీ మొదటిరోజు స్పోర్ట్స్..

టెన్నికాయిట్ ( మహిళా విభాగం) ఫస్ట్ రౌండ్..

బ్యాడ్మింటన్.. డబుల్( పురుషుల విభాగం) మూడు రౌండ్స్..

బ్యాడ్మింటన్.. డబుల్( మహిళలు) రెండు రౌండ్స్..

బ్యాడ్మింటన్.. సింగల్ ( పురుషుల విభాగం) ఒక రౌండ్..

బ్యాడ్మింటన్.. సింగల్ ( మహిళలు విభాగం) రెండు రౌండ్స్..

కబాడీ టీం ( పురుషులు విభాగం ) రెండు రౌండ్స్..

క్యారమ్స్.. సింగల్ ( పురుషుల విభాగం) రెండు రౌండ్స్ ..

క్యారమ్స్.. డబుల్ ( పురుషుల విభాగం) రెండు రౌండ్స్ ..

క్యారమ్స్.. సింగల్ ( మహిళ విభాగం) రెండు రౌండ్స్ ..

చేస్ .. సింగల్ ( పురుషుల విభాగం) రెండు రౌండ్స్ ..

వాలీబాల్ . సింగల్ ( పురుషుల విభాగం) ఒక రౌండ్స్ ..

ఖో ఖో.. ( మహిళా విభాగం) ఒక రౌండ్..

తొలిరోజు క్రీడల్లో పాల్గొంటారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు అదనపు డిప్యూటీ కమిషనర్ పి సత్య వేణి, డిప్యూటీ కమిషనర్ జి సాంబశివరావు, ఎస్.ఇ..జి. పాండురంగారావు, సిటీ ప్లానింగ్ అధికారి జే.సూరజ్ కుమార్, జిల్లా క్రీడాధికారి శేషగిరిరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *