Breaking News

రీసర్వే నిమిత్తం డ్రోన్ సర్వే

రాజమహేంద్రవరం. నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందు జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పధకం లో భాగముగా రీసర్వే నిమిత్తం డ్రోన్ సర్వే పనులను గురువారం నుండి ప్రారంభించడం జరిగిందని కొవ్వూరు తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు వంద సంవత్సరముల అనంతరం ఇటువంటి భూముల సమగ్ర సర్వే చేపట్టడం జరుగుతోందని ఆయన అన్నారు. తద్వారా ప్రజలకు భూ శాశ్వత హక్కు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే నందమూరు, ధర్మవరం గ్రామము డ్రోన్ సర్వే పూర్తిఅయినదని ఆయన తెలిపారు. నేడు పెనకనమెట్ట, దొమ్మేరు గ్రామములు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు మండలం పరిధిలో ఉన్న భూముల మొత్తము షెడ్యూల్ ప్రకారము వ్యవసాయ భూములు మరియు హాబిటేషన్ (ఇళ్ళు) సర్వే చేయడం జరుగుతుందన్నారు. డ్రోన్ సర్వే అయిన తదుపరి వెలువడిన ORI మ్యాప్ లు ఆధారముగా భూమి పై రోవర్ల సహాయముతో గ్రౌండ్ ట్రూతింగ్ , వాలిడేషన్ ప్రక్రియలు గ్రామ సర్వేయరు, గ్రామ రెవిన్యూ అధికారుల ద్వారా పూర్తి చేసుకుని రికార్డు లు తయారు చేయడం జరుగుతుందని నాగరాజు నాయక్ పేర్కొన్నారు. ఈ సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తి చేసేందుకు రైతులు , గ్రామస్తులు సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *