శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ మరియు ఎండి(హౌసింగ్ ఫర్ ఆల్ ) కుల్దీప్ నారాయణ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో నేటి 24 మరియు రేపు 25 తేదీలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న జాయింట్ సెక్రటరీ మరియు ఎండి (హౌసింగ్ ఫర్ ఆల్) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుల్దీప్ నారాయన్ కి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలకగా కుల్దీప్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పి డి వెంకటేశ్వర రావు ఉన్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గృహ నిర్మాణ శాఖ ఎండి లక్ష్మి షా వారితో కలసి తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *