పాత్రికేయులు రచించిన పుస్తకాలకు రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ప్రోత్సాహం

-ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత్రికేయుల రచనలను ప్రోత్సహిస్తూ వారు రచించిన పుస్తకాలను అందరికి అందుబాటులో వుంచేలా పుస్తకాలను కొనుగోలు చేసి అన్ని జిల్లా ,తాలుకా మరియు పౌర గ్రంథాలయాల్లో పాఠకులకు అందుబాటులో వుంచాలని కోరుతూ రాసిన లేఖను రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావుకు ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు లేఖను అందజేసారు. అందుకు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ స్పందిస్తూ… గ్రంధాలయ సంస్థ నుంచి కొనుగోలు చేసి పుస్తక రచయితలైన జర్నలిస్టులకు తగిన విధంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. త్వరలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగబోయే జర్నలిజం విలువలు- ప్రామాణిక సూత్రాలు, రాష్ట్ర అభివృధ్దిలో మీడియా పాత్ర అంశాల సదస్సులో పాలు పంచుకోవాలని కొమ్మినేని శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావును కోరారు. ప్రెస్ అకాడమి కార్యాలయం, విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ పాలకమండలి సభ్యులు జీను మహేశ్ బాబు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడి పల్లి బాలగంగాధర్ తిలక్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *