విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్‌కు ఇరువైపుల సర్వీస్ రహదార్ల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపుర్ అజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బెంజ్‌సర్కిల్ ప్ల్రైఓవర్ సర్వీస్‌రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బి రహదార్లు, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ తదితర నిర్మాణ పనుల ప్రగతిని శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ, నేషనల్ హైవేవ్స్, తదితర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ నుండి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాకి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ పరమైన అన్ని అనుమతులు పూర్తి చేసినందున త్వరితగతిన విచారణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బెంజ్‌సర్కిల్ ప్లైఓవర్‌కు ఇరువైపుల సర్వీస్‌రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణ, నష్టపరిహరపు చెల్లింపులు, తదితర పనులు వేగవంతం చేయాలన్నారు. ఆర్‌అండ్‌బి రహదారులకు సంబంధించి భూసేకరణకు రైతులకు చెల్లించవలసిన పరిహారాన్ని త్వరితగతిన చెల్లింపులు చేయాలన్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్‌హెచ్ ` 65 విస్తరణకు అవసరమైన భూసేకరణలో నందిగామ డివిజన్‌లోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలోని గ్రామాలలో పెండిరగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారిణి ఆదేశించారు. ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్‌లో భాగంగా నందిగామ డివిజన్‌లోని జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ ఆథారిటి ఆఫ్ ఇండియాకు అవసరమైన సుమారు 8 ఏకరాల భూ సేకరణలో రైతులకు త్వరితగతిన చెల్లింపులు చేయాలని ఆర్‌డివోలను జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ఆదేశించారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ అతిది సింగ్, తిరువూరు ఆర్‌డివో వై వి.ప్రసన్నలక్ష్మి, నేషనల్ హైవేస్ అధికారులు మాధవి, దివ్య, లలిత, ఆర్‌అండ్‌బి ఇఇలు యం శ్రీనివాస్‌రావు, ఎన్ కృష్ణనాయక్, ఏడి సర్వే కె.సూర్యారావు, కలెక్టరేట్ భూసేకరణ విభాగ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, డిప్యూటి తహాశీల్థార్ రాజేష్, ఆయా మండల తహాశీల్థార్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News