Breaking News

నగరంలో వీది కుక్కల నియంత్రణపై ప్రజలకు పూర్తి స్తాయిలో అవగాహన కల్పించాలి…

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో విచ్చల విడిగా సంచరించు కుక్కల నియంత్రణపై తీసుకొనవలసిన చర్యలపై స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ,ఏ,ఎస్ తన క్యాంప్ కార్యాలయములో అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంలో నగరంలో కుక్కల నియంత్రణకై చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనిన సందర్భంలో ప్రతి రోజు నగర పరిధిలో సుమారుగా 50 కుక్కలను పట్టుకొని ఎక్సెల్ ప్లాంట్ నందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించుట జరుగుతుందని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో నియోజకవర్గ నుండి రోజుకు కనీసం 100కు పైగా కుక్కలకు ఆపరేషన్ నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దీని కొరకు అవసరమైనచో అదనపు సిబ్బంది, వాహనాలు మరియు వైద్యులను వినియోగించుకొని సుమారుగా నెలకు 5000 కుక్కలకు ఆపరేషన్ నిర్వహించునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని వార్డ్ లలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎన్ని కుక్కలు ఉన్నవిని వివరాలు సేకరించుటకు అందుబాటులో ఉన్న వార్డ్ హెల్త్ సెక్రెటరీ మరియు శానిటరీ సెక్రెటరీల సహకారంతో ఎన్ని కుక్కలు ఉన్నవో వివరాలు సేకరించి దానికి తగ్గినట్లుగా ప్రణాళికలను సిద్దం చేసుకొని ప్రతి కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజలకు కూడా కుక్కల ఆపరేషన్ నిర్వహణపై అవగాహన కల్పించాలని అవసరమైనచొ పోస్టర్స్ ద్వారాల లేదా మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలో గల అన్ని వీధి కుక్కలకు తప్పని సరిగా యాంటి రేబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సదరు సమావేశంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, వి.ఏ.ఎస్ డా.రవి చంద్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.బాబు శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మరియు సి.సి.సి, ఏ.బి.సి కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *