Breaking News

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల

-పట్టభద్రుల నియోజకవర్గానికి 6 జిల్లాల పరిధిలో 320 పోలింగ్ స్టేషన్లు….మొత్తం ఓటర్లు 3,81,181 ఇందులో పురుషులు- 2,45,866 మహిళలు-1,35,284,ఇతరులు-31.
-ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 6 జిల్లాలో పరిధిలో 175 పోలింగ్ స్టేషన్లు….మొత్తం ఓటర్లు 27,694 ఇందులో పురుషులు- 16,825 మహిళలు-10,869
-జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి.

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది జాబితా ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ తెలిపారు.

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి 6 జిల్లాల పరిధిలో అన్నమయ్య,బాపట్ల,చిత్తూరు,ప్రకాశం,శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 320 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మొత్తం 3,81,181 మంది ఓటర్లు కలరని…

ఇందులో జిల్లాల వారిగా..

1.చిత్తూరు జిల్లా 48 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 54,152 మంది… ఇందులో 35,189 పురుషులు, 18,960 మంది మహిళలు, 3 మంది ఇతరులు…

2. తిరుపతి జిల్లా:

62 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 86,941 ..
ఇందులో 53,435 పురుషులు, 33,494 మంది మహిళలు, 12 మంది ఇతరులు.

3. అన్నమయ్య జిల్లా:

21 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 23,838 .. ఇందులో 15,490 పురుషులు, 8,345 మంది మహిళలు, 3 మంది ఇతరులు…

4. బాపట్ల జిల్లా: 24 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 26,390 మంది మొత్తం ఉండగా ఇందులో 17,626 పురుషులు, 8,763 మంది మహిళలు, ఒక్కరు ఇతరులు…

5. ప్రకాశం జిల్లా:

86 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 82,225.. ఇందులో 55,703 పురుషులు, 26,517 మంది మహిళలు, 5 మంది ఇతరులు..

6. శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు)జిల్లా లో 79 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 1,07,635 ఇందులో 68,423 పురుషులు, 39,205 మంది మహిళలు, 7మంది ఇతరులుగా కలరన్నారు.

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి అన్నమయ్య,బాపట్ల,చిత్తూరు,ప్రకాశం,శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 175 పోలింగ్ స్టేషన్ల పరిధి లో 27,694 మంది ఓటర్లు కలరని …

ఇందులో జిల్లాల వారిగా

1. చిత్తూరు జిల్లా మొత్తం 31 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 3,887 మంది ఉండగా.. ఇందులో 2,341 పురుషులు, 1,546 మంది మహిళలు,

2. తిరుపతి జిల్లా:

37 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 6,132 ఇందులో 3,604 పురుషులు, 2,528 మంది మహిళలు.

3. అన్నమయ్య జిల్లా
15 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 1,932 ఇందులో 1,180 పురుషులు, 752 మంది మహిళలు.

4. బాపట్ల జిల్లా: 13 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం 1,789 మంది మొత్తం ఓటర్లు ఉండగా ఇందులో 1094 పురుషులు, 695 మంది మహిళలు

5. ప్రకాశం జిల్లా

40 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 5,789 ఇందులో 3,691 పురుషులు, 2,098 మంది మహిళలు

6. శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు)జిల్లా లో 39 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 8,165 ఇందులో 4,915 పురుషులు, 3,250 మంది మహిళలు కలరన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *