రాస్తా అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నూతన కమిటీ ప్రమాణం స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వన్ టౌన్ షాదీఖానా ఫంక్షన్ హాల్లో రాస్తా అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నూతన కమిటీ ప్రమాణం స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాస్తా నూతన అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్. జనరల్ సెక్రటరీ గౌస్ ఖాన్ కమిటీ గౌరవ సలహాదారుడు నజీరుద్దీన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు అబ్దుల్లా అజిఫ్ మీడియాతో మాట్లాడుతూ తనకి బాధ్యతలు చెప్పినందుకు తనపై నమ్మకం ఉంచినందుకు అసోసియేషన్ లో ప్రతి ఒక్క సభ్యులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ గౌస్ ఖాన్ మాట్లాడుతూ అసోసియేషన్లో ద్వారా పలిసేవ కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ లో ఏ సభ్యుడు అయిన అనారోగ్య పాలైన వారికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ టెక్నీషియల్ కి కొత్త కొత్త విధానాలు కోసం వాట్సాప్ మెసేజ్ ల ద్వారా ట్విట్టర్ ధర కొత్త టెక్నీషియన్ ఆధునిక పరిజ్ఞానాన్ని సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారుడు నజరుద్దీన్ మాట్లాడుతూ అసోసియేషన్ కి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కోసం సజ్జల రామకృష్ణ రెడ్డి కి, కార్మిక శాఖ మంత్రి కి, సీఎం కి ప్రత్యేక వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అసోసియేషన్ గుర్తించి లోన్ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *