విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ నాయకులకు సేవే పరమావధి కావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు పద్మావతి తెలిపారు. శనివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలో ని 4వ డివిజన్ భారతి నగర్ చెంది తిరువిధి విష్ణు ప్రియ అద్దె టిఫిన్ బండి మరమ్మత్తుకు గురై ఇబ్బందులు పడుతున్న విషయం దేవినేని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అన్నారు.అయన వెంటనే స్పందించి దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 25,000/-రూపాయల విలువ గల టిఫిన్ బండిని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంలో గల్లా పద్మావతి మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు దేవినేని అవినాష్ కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి,వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి,పాలడుగు శంకర్రావు,బోబ్బా కిశోరె,బొడ్డు తరుణ్,వంశి,సునీత,రుబీనా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News