అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తోన్న (ఎండియు) మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లకు బీమా ప్రీమియంను ఈ ఏడాది నుంచి వాహనమిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎండియు ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు.తమకు వచ్చే వేతనం నుంచి ఎం డి యు వాహనాల ప్రీమియంను ప్రతి ఏడాది బ్యాంకులు జమ చేసుకోవడంతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండియు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో మంత్రి కారుమూరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. అయితే ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021నుంచి అమలు చేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జూలై లో సొంత గా ఆటో,ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో ఎండియు ఆపరేటర్లకు ప్రీమియం తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది.
Tags amaravathi
Check Also
లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ
-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …
Prajavartha Online Telugu News