ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు పాలకమండలి సభ్యులు శనివారం ఆలయములోని వివిధ విభాగములు మరియు కౌంటర్లు ను ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది, భక్తులతో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగముగా ఈరోజు వీరు నాగపుట్ట వద్ద ఉన్న ప్రసాదం కౌంటర్, ఆర్జిత సేవ కౌంటర్, దర్శనం క్యూ లైన్ లు, త్రాగు నీరు ఏర్పాటు, ప్రసాదం తయారీ, 6వ అంతస్తులోని మెయిన్ స్టోర్ మరియు ఇతరములును పరిశీలించారు. ప్రసాదం తయారీ కేంద్రం వద్ద ప్రసాదం ముడిసరుకులు, నాణ్యత, బరువు, శానిటేషన్ పరిశీలించారు. టెండర్ సాంపిల్స్ ప్రకారమే ప్రసాదం తయారీ ముడి సరుకులు ఉండాలని తెలిపారు. ప్రసాదం తయారీ, పంపిణీ పర్యవేక్షణకు పాలకమండలి సభ్యులు చింకా శ్రీనివాస్ గారిని నియమించామని చైర్మన్ గారు అన్నారు. మరియు ఇతర విభాగముల పర్యవేక్షణ భాద్యత మిగిలిన సభ్యులకు కేటాయించడం జరిగినదన్నారు.
వివిధ విభాగముల అధికారులు, సిబ్బంది మరియు కౌంటరు సిబ్బంది తో మాట్లాడి వివరములు అడిగి తెలుసుకొని, భక్తులకు మెరుగైన సేవలు అందించుటకు గానూ కొన్ని సూచనలు చేశారు. అర్చకులతో మాట్లాడి వారి సలహాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో మర్యాదగా నడుచుకోనవలేనని తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి దర్శనం మరియు ఇతర ఏర్పాట్లు గురించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తిని వ్యక్తపరిచారు. అన్ని అంశములపై ఆలయ కార్యనిర్వాహనాధికారితో, అధికారులతో చర్చించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మహామండపం 07 వ అంతస్తు నందు ఈరోజు ధర్మపదం వేదిక నందు ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరము ను ప్రారంభించారు. పలువురు భక్తులు ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం ను వినియోగించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు శ్రీ కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కృష్ణ, బుద్దా రాంబాబు, చింకా శ్రీనివాసులు గార్లు, ఆలయ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News