నేటి నుంచి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

-జిల్లా స్థాయిలో ఎంపికైన 260 ప్రాజెక్టులు ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఆంధ్రా లయోలా కాలేజీలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుండి 10 తరగతుల విద్యార్థులు తయారు చేసి, జిల్లాస్థాయిలో ఎంపికైన 260 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. తిలకించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *