కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం (27.02.2023) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం…
నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు తమ వినతులను స్పందన కార్యక్రమంలో అందించి పరిష్కరించుకోవాలని సబ్ కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. డివిజన్ స్థాయి అధికారులు స్పందన కార్యక్రమానికి తప్పనిసరి హాజరు కావాల్సి ఉంటుందని సబ్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *