42వ జాతీయ మాస్టర్స్ అథ్లెయిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో విజేతలకు అభినందనలు

రాజమహేంద్రరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది. 10-02-2023 నుండి 12-02-2023 42వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ 2023 లో మిడ్నాపూర్ సమీపంలోని( కరాఘపూర్) పశ్చిమ బెంగాల్ అరవిందో స్టేడియం నందు జరిగిన 42వ జాతీయ మాస్టర్స్ అథ్లెయిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో పాల్గోని మూడు పతకాలు సాధించిన యతం నాగబాబు ను పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా లు అభినందించారు. ఆదివారం రాజమహేంద్రవరం లోని ఎంపి ని, శాసన సభ్యులను కలిసిన యతం నాగబాబు తాను గెలుపొందిన పతకాల వివరాలు తెలియచేశారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా మలేరియా విభాగం కాకినాడ జిల్లా నందు కాకినాడ సబ్ యూనిట్ అధికారి 4*400 మీటర్లు  (1వ స్థానం) బంగారు పతకం , పరుగు పందెం& 400 మీటర్ల (1వ స్థానం) హర్డిల్స్‌లో బంగారు పతకం 4* 100 మీటర్లు (3వ స్థానం) కాంస్య పతకం నందు విభాగాలు నందు పాల్గొని 2 బంగారు పతకాలు & 1 కాంస్య పతకం మొత్తం 3 పతకములు సాధించినట్లు తెలిపారు. 2013 సII నుండి 2023సంII వరకు జరిగిన వివిధ జాతీయ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ నందు పరుగు పందెం 100, 200, 400, 800.1500 మీటర్ల & రిలే వివిధ విభాగములు నందు పాల్గొని ఇప్పటి వరకు మొత్తం 60 పతకాలు (15 బంగారు, 19 వెండి 19, 26 క్యాంస్య పతకాలను సాధించడం పట్ల పలువురు యతం నాగబాబు ను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం

-ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -హెచ్‌ఐవీని నియంత్రించడంలో క్రమం తప్పకుండా మందుల వినియోగం కీలకం -జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *