Breaking News

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ ఎమ్ సి 2023 లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆర్ ఎం సి 23 క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ, అధికారులు ఉద్యోగులు, సిబ్బంది మధ్య సహృద భావం పెంపొందించడం లో భాగంగా క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. అందరూ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఇటువంటి పోటీలను నిర్వహించి, ఒత్తిడి అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రీడలు ఘనంగా నిర్వహించడంలో 45 ఫిసికల్ డైరెక్టర్ లు, ఫిసికల్ ఎడ్యుకేషన్ ట్రైనీ లు పోటీల ఎంపైరింగ్ చేపట్టడం జరిగింది. వారికి కమిషనర్ అభినందనలు తెలిపారు. మొత్తం ఈ క్రీడల్లో కబాడి, కోకో, క్రికెట్, క్యారమ్స్  , చెస్, షెట్టిల్, బాడ్మెంటిన్, వాలీబాల్, త్రో బాల్, టెన్ని క్యాఇట్, టేబుల్ టెన్నిస్,  అధెటిక్స్ విభాగంలో పరుగు పందెం, హై జంప్, రీలే పరుగు, నడక పరుగు, షార్ట్ పుట్  అధెటిక్స్ తదితర అంశాలలో 500 పైగా మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్రీడలు సజావుగా నిర్వహించడానికి ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షణ చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అదనపు డిప్యూటీ కమిషనర్  పి ఎం సత్య వేణి, ముఖ్య పట్టణ ప్లానింగ్ అధికారి జె.సూరజ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్  జి.పాండు రంగారావు, ఇతర  అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *