-బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగు ఉద్యోగుల పరిస్దితి రోజు రోజు కు చాలా దయనీయమైన పరిస్దితికీ నెట్టబడుతుంది. ఈపరిస్దితులన్నింటిని ప్రభుత్వపెద్దలకు, ప్రభుత్వఉన్నతాధికార్లుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాసరే ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చొరచూపడంలేదు. తప్పని సరి పరిస్దితులలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారి పోరాటాలతో ప్రారంబించి చివరకు ఉద్యోగుల సమస్య పరిష్కరించుకొనేందుకు ఎటువంటి పోరాటాలకు ఉద్యోగులను సిద్దం చేసేందుకు ఆంధోళణా కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఏపి జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్టం నాయుడు తెలిపారు.
ఆదివారం విజయవాడ రెవిన్యూభవన్ లో జరిగిన ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు లు మాట్లాడుతూ ఏపి ఉద్యోగుల మంతా ఎంతో ఆశగా ఎదురు చూసిన 11 వ పిఆర్శీ లో కూడా ఉద్యోగులుకు చాలా అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు చర్చలలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి మాప్రభుత్వం లో ఉద్యోగులు కూడా బాగస్వామ్యూలే మీ ఇబ్బందులు మాఇబ్బందులు అనుకొని అన్ని చేస్తామని మమ్మలని నమ్మబలికి నాడు ఇచ్చిన హామిలు అమలు చేయమని ప్రభుత్వపెద్దలను అడుగుతున్నా, ఉన్నతాధికార్లును అడుగుతున్నా సరే అందరు మౌనంగానే ఉంటున్నారన్నారు. ఈపరీస్దితులన్నింటికీ అన్నిడిపార్టుమెంటు ఉద్యోగులు, కేడర్ వారిగా పడుతున్న ఇబ్బందులు,సమస్యలు,ఆర్దిక,ఆర్దికేతర సమస్యలు అన్ని తేదిః 13-02-2023 న ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి 50 పేజీల మెమోరాండం ఏపిజెఏసి అమరావతి రాష్ఠ్రకమిటి తరుపున ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా సమస్యలు పరిష్కారంలో చొరవ చూపని కారణంగా తప్పని పరిస్దితులలో ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కానికి ఉద్యమానికే సిద్దపడాల్సిపరిస్దితులు వచ్చిందని ఏపి జెఏసి అమరావతి నాయకత్వం తెలిపారు.
11 వ పిఆర్సీ లో క్యాడర్ వారి స్కేల్స్ ను నేటికీ సంబందిత అధికారులకు పంపనందున, 2018 తర్వాత ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు వారి కొత్త పే స్కేల్ ఎంతోతెలియని పరిస్దితులలో ప్రస్తుతం 2015-PRC స్కేలును 2022-prc స్కేలుతో పోల్చుకుని జీతాలు డ్రా చేస్తున్నాపరిస్దితి ఉందన్నారు. 11వ PRC లో, చాలా శాఖలలో ఉద్యోగులకు స్పెషల్ పే లు, అలవెన్సులు పై కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ, నేటికీ ఉత్తర్వులు ఇవ్వనందున చాలా శాఖలలో కొన్ని cadre ఉద్యోగులకు ఆర్ధిక నష్టం జరుగుతుందన్నారు. 11వ పీఆర్సి (అమలు తేదీ 1.4.2020 నుండి 31.12.2021 మద్య కాలానికి) అరియర్స్ ఎప్పుడూ చెల్లిస్తారో తెలియని పరిస్దితి ఉందన్నారు. పదవీ విరమణ లేదా మరణించిన ఉద్యోగులు ఎవరికి ఎలాంటి ఆర్థికపమైన బెనిఫిట్స్ నేటికీ అందలేదన్నారు. ఎర్నెడ్ లీవులు, సరెండర్ లేవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లోనులు/విత్ డ్రాలు, లీవ్ సాలరీలు, సిక్కులపై జీతాలు/సప్లిమెంట్ బిల్లులు, టి ఏ బిల్లులు గత రెండు సంవత్సరాలుగా రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి CPS రద్దు చేసి, పాత పింఛను విధానం తెస్తామని ఇచ్చిన హామిని అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ, అన్ని విభాగాలలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరిపి ఆకుటుంబాలను ఆదుకోవాలన్నారు. EHS ద్వారా మెరుగైన కార్పురేట్ ఆసుపత్రులద్వారా వైద్యం అందించాలి.పెండింగు మెడికిల్ బిల్లులు చెల్లించాలన్నారు. విధ్య, వైధ్యరంగాలు, ఆర్టీసి, మున్సిపల్, యూనివర్శిటీ, గ్రామసచివాలయ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఈఉద్యమానికి అన్నిట్రేడ్ యూనిన్లు,ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని తదితర ఉద్యోగులు ప్రధాన సమస్యలు తెలిపారు.
ఉద్యమకార్యాచరణ షెడ్యూల్
-మార్చి 9, 10 తేదీలలో ఉద్యోగులమంతా నల్లబ్యాడ్జిలు దరించి విధులకు హాజరై నిరసన తెలియజేస్తాం.
-మార్చి13, 14 తేదిలలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ /ఆర్.డి.ఓ కార్యాలయాలవద్ద బోజనవిరామం సమయంలో నిరసన సమావేశాలు.
-మార్చి 15, 17, 20 తేదీలలో జిల్లాకలెక్టర్లు కార్యాలయాలవద్ద భారీ మహాధర్నాలు నిర్వహిస్తాం.
-మార్చి 21 నరోజంతా ఉద్యోగులు సెల్ ఉపయోగించకుండా సెల్ డౌన్ చేపడతాం.
-మార్చి 24 న రాష్ట్రస్దాయిలో అన్ని కమీషనర్ కార్యాలయాలవద్ద ధర్నాలు చేపడతాం.
-మార్చి 27 న కారుణ్యనియామాకాలలో చనిపోయిన కుటుంబసబ్యులను జిల్లాలలో సందర్సన చేస్తాం.
-ఏఫ్రిల్ 1 న 1.రాష్ట్రవ్యాప్తంగా పదవి విరమణ చేసిన కుటుంబాలను,
2.అతి తక్కువ పెన్సన్ పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలను,
3.సిపియస్ ఉద్యోగులను కలిసి వారి బాదలు తెలుసుకుంటాం.
4. ఆర్జిత సెలవు,సరండర్ లీవ్ లు,జిపియఫ్,ఏ.పి.జి.యల్ రానివారి ఆర్దికఇబ్బందులు పడుతున్ణవారిని కలుస్తాం.
-ఏఫ్రీల్ 3 న చలో కలెక్టరేట్ గా వెళ్లి ఉద్యోగుల సమస్యలతో గ్రీవెన్సు డే ను నిర్వహించి సమస్యలు మెమోరాండాన్ని కలెక్టర్లకు అందజేస్తాం.
-ఏఫ్రిల్ 5 న రాష్ట్రకార్యవర్గం నిర్వహించి భవిష్యత్ కార్యచరణపై కీలకనిర్ణయాలు ప్రకటిస్తామన్నారు.
Prajavartha Online Telugu News