ఎక్సెల్ ప్లాంట్ల నందు చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పనుల యొక్క పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్లాంట్ ఆవరణలో మిగిలిపోయిన సి.సి.రోడ్లను వేయాలని, కొత్తగా ఆఫీసు బిల్డింగ్ ను నిర్మాణం చేపట్టాలని సంబందిత అధికారులకు సూచించారు. Cal-on ఇండస్ట్రీస్ వారి నిర్వహణలో గల చెత్త వేయింగ్ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. ప్లాంట్ ఆవరణలో ప్రహరి గోడ ప్రక్కన ఏర్పాటు చేసిన గ్రీనరీని పరిశీలించి ఖాళీగా ఉన్న ప్రదేశములో పూర్తి స్థాయిలో గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు. అదే విధముగా షేడింగ్ మిషన్ ద్వారా చెట్ల కొమ్మలను క్రష్ చేయు విధానము పరిశీలించి చెట్ల కొమ్మలు ప్లాంట్ ఆవరణలో గల అన్ని కొమ్మలు వేగవంతముగా క్రాష్ చేయునట్లుగా చూడాలని ఆదేశించారు. తదుపరి సర్కిల్-2 పరిధిలో గల సత్యనారాయణపురంలో నూతనంగా అభివృద్ధి పరచిన సి.సి. రోడ్లను రీబౌండ్ హ్యామర్ తో పనుల యొక్క నాణ్యతను మరియు రోడ్డు యొక్క లోతు పరిమాణం నిబంధన ప్రకారం ఉన్నది లేనిది స్వయంగా పరిశీలించారు. సదరు రోడ్ల యందు జరుగుతున్న డ్రెయిన్ పనుల పురోగతిని పర్యవేక్షించి నిర్మాణ పనులు వేగవంతము చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జోనల్ కమిషనర్-2 యు. సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సత్యనారాయణ రావు, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం

-ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -హెచ్‌ఐవీని నియంత్రించడంలో క్రమం తప్పకుండా మందుల వినియోగం కీలకం -జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *