Breaking News

ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గృహము సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి ధవళేశ్వరంలోని ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గృహమును సోమవారం సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందితో చెప్పారు. అనంతరం ధవళేశ్వరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని పాఠశాల సిబ్బందితో అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *