Breaking News

విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ లో తృతీయ బహుమతి పొందిన హర్ష వర్ధన్ రాజును కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్ధులు చదువుతో పాటు వారికి నచ్చిన క్రీడల్లో కూడా పాల్గొనాలని, అప్పుడే సంపూర్ణ మానసిక, శారీరక దృఢత్వం పొందుతారన్నారు. నగరపాలక సంస్థ మున్సిపల్ స్టేడియంలో శిక్షణ పొందిన స్విమ్మర్ బి.హర్ష వర్ధన రాజు ఆదివారం కృష్ణా నదిలో ఆక్జవా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీల్లో దుర్గ గుడి దగ్గర నుండి గుంటూరు వైపు ఉన్న లోటస్ ఫుడ్ సిటి వరకు 11 నుండి 18 ఏళ్ల విభాగం లో 1.5 కిలో మీటర్ల దూరాన్ని 16.34.37 నిమిషాల్లో ఈది తృతీయ స్థానం సాధించారన్నారు. స్విమ్మింగ్ లో ప్రతిభ చాటిన హర్ష వర్ధన రాజు, శిక్షకులు ఖాజా మొహిద్ధిన్ లను నగరపాలక సంస్థ నుండి ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్ర సంకల్పం చేశా…

-అంతా సంకల్పిస్తేనే దేశం, రాష్ట్రం, గ్రామం అభివృద్ధి -దేశ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యమే కీలకం -పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *