గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రధాన పార్క్ అయిన గాంధీ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని, పెండింగ్ పనులు కూడా త్వరగా పూర్తీ చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గాంధీ పార్క్ అభివృద్ధి పనులను, లక్ష్మీపురం మదర్ దెరిస్సా విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధి, బస్టాండ్ వద్ద మహిళ కోసం ప్రత్యేకంగా పింక్ టాయ్ లెట్ నిర్మాణం పై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ట్రాఫిక్ పోలీస్, ఆర్.టి.సి. అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ పార్క్ పనులు సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్నాయని, పనులను పూర్తీ చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యెక కృషి చేయాలని ఆదేశించారు. పార్క్ లో ఇప్పటికే మెయిన్ ఎంట్రీ ఆర్చి, టికెట్ కౌంటర్ రూమ్, ల్యాండ్ స్కేపింగ్, ఫిష్ ఎక్వేరియం మరమత్తు, పెయింటింగ్, పాత మ్యుజియం మరమత్తు, పెయింట్, డైనోసార్ పెయింట్, క్లాక్ టవర్ వంటి పనులు చివరి దశకు వచ్చాయని, మిగిలిన పనులను కూడా నిర్దేశిత కాలపరిమితితో పూర్తీ చేయాలన్నారు. చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్స్ రెండు రోజుల్లో తీసుకురావాలని, మెయిన్ గేటును మంగళవారం ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు.
అనంతరం లక్ష్మీపురం మదర్ దేరిస్సా విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధికి పరిశీలించి, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, సెంటర్ కు మంచి లుక్ వచ్చేలా డిజైన్లు తయారు చేసి ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మహిళ కోసం ప్రత్యేకంగా పింక్ టాయ్ లెట్ ఏర్పాటు కోసం బస్టాండ్ వద్ద ఆర్.టి.సి., ట్రాఫిక్ పోలీసు, ఇంజినీరింగ్, పట్టాన ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించారు.
పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, ఏ.డి.హెచ్. రామారావు, ఈస్ట్ ట్రాఫిక్ సి.ఐ. నిస్సార్ బాష, ఆర్.టి.సి. గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం, ఏ.టి.ఎం. సత్యనారాయణ, డి.ఈ.ఈ. వెంకటేశ్వరరావు, ఏ.సి.పిలు, డి.ఈ.ఈ.లు, ఎస్.ఎస్.లు కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News