Breaking News

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అడ్మిన్ కార్యదర్శులపై కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి పన్ను వసూళ్ళకు సచివాలయాల వారిగా లక్ష్యానికి తగిన విధంగా విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అడ్మిన్ కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూళ్ళలో వెనుకబాటు, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం గా ఉన్న ముగ్గురు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ, మరో ముగ్గురు అడ్మిన్ కార్యదర్శులకు, రెవెన్యు ఇన్స్పెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ నగర కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి నాటికి ఆస్తి పన్ను నూరు శాతం వసూళ్ళు కావాలని, ప్రతి సచివాలయం పరిధిలో పన్ను వసూళ్ళ పై ప్రత్యెక కార్యాచరణ కూడా సిద్దం చేశామన్నారు. కాని కొందరు అడ్మిన్ కార్యదర్శులు కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా, హాజరు వేసుకున్న తర్వాత విధుల్లో లేకుండుట, పన్ను వసూళ్ళు కూడా లక్ష్యానికి అనుగుణంగా లేక పోవడంను అదనపు కమిషనర్ ఆకస్మిక తనిఖీలో హాజరు పట్టికలో హాజరు నమోదు చేసి, ఎటువంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు గుర్తించారన్నారు. సదరు కార్యదర్శులు పన్ను వసూళ్ళు విధుల్లో లేకపోవడం, జాబ్ చార్ట్ ప్రకారం యూనిఫారం దరించకుండా కూడా ఉంటున్నారన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం గా ఉన్న 86&83 ఇంచార్జి, 38, 41 సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులు కె.సత్య శ్రావణి, రాధిక మారాసు, బొడ్డు రజనిలను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాసరావుకి, 122, 80, 170 వార్డ్ సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కేంద్ర సహకారం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి మహర్దశ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *