Breaking News

అర్జీల పరిష్కారంపై మరింత శ్రద్ద పెట్టండి…

-నేటి స్పందనలో 94 అర్జీలు నమోదు…
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను స్పందన దృష్టికి తీసుకువస్తే పరిష్కారమవుతాయనే దృక్పదంతో స్పందన ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆఫ్‌ లైన్‌, ఆన్‌ లైన్‌లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, స్పందన మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా అర్జీలు నమోదవుతుంటాయన్నారు. స్పందనలో ఒకసారి నమోదైన అర్జీ తిరిగి నమోదు కాకూడదన్నారు. స్పందనలోని ప్రతి ఫిర్యాధును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హత ఉన్నప్పటికి సంక్షేమ పథకాలు అందకపోవడం, అన్యాయం జరిగిన సందర్భాలలో ఫిర్యాధులు వస్తే విచారించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. ఏపి సేవా డాష్‌, బోర్డు, జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌లలో జిల్లాకు చెందిన అర్జీల పెండిరగ్‌ లేకుండా ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
నేటి స్పందనలో 94 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 32, పోలీస్‌ 13, యంఎయుడి 10 ఏపిఎస్‌పిడిసిఎల్‌ 5, దేవదాయశాఖ 4, ఇరిగేషన్‌ 4, పంచాయతీరాజ్‌ 4, సర్వే అండ్‌ సెటిలిమెంట్‌ 3, విద్యా 3, హౌసింగ్‌ 3, ఆర్‌అబ్ల్యుఎస్‌ 2, డిడబ్ల్యుయంఏ 2, వైద్య2, పౌర సరఫరాల శాఖ 1, డిఆర్‌డిఏ 1, గనులు అండ్‌ భూగర్భ శాఖ 1, ఖజాన 1,అటవీ 1, ఏపిఎస్‌ఇర్‌టిఎస్‌1, ఐసిడిఎస్‌ 1 శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్‌ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డ్వామా పిడి జె. సునీత, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్‌, డిసివో సిహెచ్‌ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్‌, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం. విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్ర సంకల్పం చేశా…

-అంతా సంకల్పిస్తేనే దేశం, రాష్ట్రం, గ్రామం అభివృద్ధి -దేశ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యమే కీలకం -పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *