-మత్తుపదార్థాల విషసంస్కృతిపై కళాశాలలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్తుపదార్థాల వలన కలిగే అనార్థాలను వివరించి విష సంస్కృతికి దూరంగా ఉండేలా విద్యార్థులలో చైనత్యంపెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఇటీవలన నిర్వహించిన విభిన్నపతిభావంతుల ఆటల పోటీలలో సేవలందించిన కానూరు పివిపి సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో ప్రసంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత ముఖ్యంగా కళాశాల స్థాయి నుండి విద్యార్థులు మత్తు పదార్థాల విష సంస్కృతికి బానిస అవుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఉత్తమ సమాజానికి మార్గదర్శుకులు విద్యార్థులే అన్నారు. ఇటీవల పెరిగిన ఆధునాతన టెక్నాలజీ, విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో మేలు చేస్తుందని అయితే సాంకేతిక విజ్ఞానాన్ని కొందరు విద్యార్థులు చెడు వ్యసనాలకు ఉపయోగిస్తూ భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారన్నారు. పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య, మహిళాభివృద్ధి, సంఫీుక సంక్షేమం తదితర శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహించి మత్తుపదార్థాల వినియోగాన్ని ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తుపద్దార్థాలు, లైంగిక వేధింపులు వంటివి నివారించేందుకు విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. నగరంలోని నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలందించడం అభినందనీయమన్నారు. ఔత్సాహిక వంతులైన విద్యార్థులు టీమ్‌లుగా ఏర్పాడి, విద్యార్థులలో ముఖ కవలికలు, ఆరోగ్యపరమైన మార్పులను గమనించి మత్తుపదార్థాలు చెడు అలవాట్లకు బానిసలవుతున్నట్లు గుర్తింస్తే వారి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తే నిజమైన సేహ్నితులుగా మిగిలిపోతారన్నారు. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. విద్యార్థులకు ప్రసంసా పత్రాలు పంపిణీలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రామ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News