‘‘స్పా’’ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీపార్లర్‌లపై దాడులను నిరంతరం కొనసాగించండి..

-అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై క్రిమినల్‌ చర్యలకు వెనుకడోద్దు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘స్పా’’ సెంటర్ల పై మరింత నిఘా పెంచాలని మసాజ్‌ సెంటర్‌ ముసుగు లో అసాంఘిక చర్యలకు పాల్పడే స్పా సెంటర్ల పై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ఎట్టిపరిస్థితులోను వెనుకాడవద్దని జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
‘‘స్పా’’ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడంపై సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో పోలీస్‌ టాస్క్‌ఫోర్సు, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మహిళా శిశు సంక్షేమం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలోని స్పా సెంటర్‌ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించి తగు నిఘాను పెట్టడం జరిగిందన్నారు. స్పా సెంటర్ల నిర్వహణపై నిఘాను మరింత పెంచాలన్నారు. నగరంలో ‘‘స్పా’’ సెంటర్లపై నిఘాకు నాలుగు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలోని నిర్వహిస్తున్న 126 స్పా సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్‌ర్ల పై తనిఖీ నిర్వహించగా వాటిలో 88 స్పా సెంటర్ల నందు అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించి, వాటిని మూసివేసేలా చర్యలు తీసుకోవడం పట్ల అధికారుల బృందాలను అభినందిస్తున్నానన్నారు. దాడులను నిరంతరం కొనసాగించి స్పా సెంటర్ల నిర్వహకులలో అసాంఘిక చర్యలకు పాల్పడకూడదనే భయాన్ని కల్పించాలన్నారు. ప్రభుత్వం నియమనిబంధనలను అతిక్రమించి ఎటువంటి అసాంఫీుక కార్యకలాపాలను నిర్వహించిన ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లను ఉపేక్షిస్తే నగరం మరో కలకత్తా, ముంబై నగరాల మాదిరిగా విషసంస్కృతికి అవకాశం కల్పించిన్నట్లు అవుతుందన్నారు. 1956 ఐటిపి యాక్ట్‌ సెక్షన్‌ 18,19 ల అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలను మాయ మాటలతో మభ్యపెట్టి ‘‘స్పా’’ సెంటర్ల ద్వారా అసాంఘిక కార్యకాలపాలను నిర్వహించే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్పా సెంటర్లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవడం పై సంబంధిత సెంటర్ల నిర్వహణకు అద్దెకిచ్చిన భవన యాజమానులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీలలో పట్టుబడిన మహిళలు, బాలికలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి వారిలో సత్‌ప్రవర్తన తీసువచ్చేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే పునరవాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమాధికారులను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి రమణ మూర్తి, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, నగరపాలక సంస్థ సిఇ యం ప్రభాకర్‌ రావు, సిడిపివో కె. మంగమ్మ, నాగమణి, టాస్క్‌ ఫోర్స్‌ ఎసిపి శ్రీథర్‌కుమార్‌, కార్మిక శాఖ అసిస్టెంట్‌ లేబర్‌ కమీషనర్‌ పి మహేశ్వరెడ్డి, లేబర్‌ ఆఫీసర్‌ పి శ్రీనివాసరావు, డిప్యూటి సిటీ ప్లానర్‌ జూబెన్‌, ఫైర్‌ ఆఫీసర్లు కె. నరేష్‌, యం రాజా, శ్రీనివాసరావు, డా. బి. శ్రీదేవి, విజయవాడ తూర్పు తహాశీల్థార్‌ యం. వెంకట రామయ్య తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *