-విద్య రంగంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న మొదట అమలు చేసేది ఏపీలోనే..
-వచ్చే ఏడాది నుంచి ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ లు
-విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి
-జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి పథకాల ఫలితాలు అమోఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయాణ మాట్లాడుతూ..పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య ఒక్కటే అనే విధానంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని..అందులో భాగంగా విద్యా రంగంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మొదట అమలు చేసేది ఆంధ్రప్రదేశ్ లోనే అని వ్యాఖ్యానించారు. ప్రతి క్షణం పిల్లల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని..అందుకే చరిత్రలో లేనివిధంగా రాష్ట్రస్థాయిలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించుకుంటున్నామన్నారు. మేధావులు, విద్యావేత్తలు అయిన సి.వి.రామన్, అబ్దుల్ కలాం, రామానుజన్ జీవితాలను ప్రతి ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులంతా తమ దైనందిన కార్యక్రమాల్లో సైన్సుకు సంబంధించిన అంశాలను గుర్తించి..వాటిపై పరిశోధనలు చేసే స్థాయికి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని..అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. విద్యా రంగంలో చేస్తున్న మార్పుల వల్ల విమర్శలు వస్తున్నా.. లెక్క చేయకుండా విద్యార్థులకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి, గెస్ట్ లెక్చర్స్ ఇస్తారని ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే సబ్జెక్టు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఏ బేధభావం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమనే ఆలోచన విద్యార్థుల్లో వచ్చేలా ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు మరింత హుందాగా కనిపించాలన్న యోచనతో వచ్చే సంవత్సరం విద్యార్థుల యూనిఫామ్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గతంలో ఢిల్లీలో విద్యా విధానం బాగుందని వార్తల్లో చూసే వాళ్ళం..నేడు ఏపీలో ఢిల్లీని మించిన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. సమాజ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు ప్రధాన ఆశయంగా పాఠశాల విద్యను మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. మాజంలో అభివృద్ధి ఒక ఆలోచన నుంచే పుడుతుందన్నారు. విద్యార్ధుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహణ ఉపయోగపడుతుందన్నారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించామన్నారు. పాఠశాల స్ధాయి నుంచి మండల, జిల్లా స్ధాయి వరకు సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేశామని..జిల్లా స్థాయిలో పది చొప్పున సైన్స్ ప్రదర్శలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. నవంబర్ లో నిర్వహించిన పాఠశాల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో మొత్తం 85వేల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొనగా డిసెంబర్ లో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో 17,500 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేశారన్నారు. అనంతరం జనవరిలో జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో 3,500 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొనగా నేడు ప్రారంభించిన రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానికి సదస్సులో 26 జిల్లాలకు చెందిన ఒక్కో స్కూల్ నుంచి 10 మంది విద్యార్థుల చొప్పున 260 మంది పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో మొత్తం 713 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయని..వాటిలో రూ.10 లక్షల విలువైన సైన్స్ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని ఉపయోగించుకుని నూతన టెక్నాలజీ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రయోగాల స్ధాయిని మరింత పెంచాలన్నారు.
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ..రాష్ట్రంలో విద్యాభివృద్దికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ అన్నారు. నాణ్యమైన విద్యతోనే పిల్లల జీవితాలలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారన్నారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని..మనబడి నాడు-నేడు వంటి గొప్ప పథకాలు అమలు చేస్తోందన్నారు. విద్యార్ధులు పోటీతత్వం అలవర్చుకోవాలని..ఉపాధ్యాయులు కూడా పరిశోధనలపై మరింత ఉత్సాహం చూపించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు మాట్లాడుతూ..జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అన్నారు. 26 జిల్లాల నుంచి 5 అంశాలపై చేసిన 260 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం సంతోషకరమన్నారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఆరోగ్యం, సాఫ్ట్ వేర్, పర్యావరణం, గణితం వంటి అంశాలపై ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందన్నారు. వీటిలో ఎంపికైన వాటిని జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక చేస్తామన్నారు. మిగిలిన 245 ప్రాజెక్టుల విద్యార్థులు నిరుత్సాహ పడవద్దని..శాస్త్రీయ దృక్పథాన్ని మరింత అలవర్చుకుని నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.
విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ..పాఠశాల విద్యకు మరింత శోభ తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ జరుగుతోందని విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా మరింత కొత్తదనంతో విద్యార్థులు సరికొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. విజయవాడ నగర శానిటేషన్ కు విద్యార్థులెవరైనా ఉత్సాహంతో ముందుకు వచ్చి ప్రాజెక్టులు రూపొందిస్తే వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..పాఠశాల విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి అన్నారు. చరిత్రలో లేని విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సలహాలు, సూచనల ప్రకారం 26 జిల్లాల్లో సైన్స్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు.
ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ..విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషితో మట్టిలో మాణిక్యాలు..ఆణిముత్యాలుగా మారుతున్నారని ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ అన్నారు. పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయన్నారు.
విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో ప్రారంభించిన రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక సదస్సును రెండ్రోజులపాటు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన మొత్తం 260 ప్రాజెక్టులను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ ప్రాజెక్టులను జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, సాంస్కృతిక గీతాలు వీక్షకులను అలరించాయి. రాజమహేంద్రవరానికి చెందిన విద్యార్థిని దుర్గ..ప్రభుత్వ పథకాలను, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడి అతిథులను ఆకట్టుకుంది. అనంతరం నగరానికి చెందిన కె.బి.సి.జెడ్పీ, ఎంకే బేగ్, ఎస్కేపీవీ హిందూ, నావల్ యూనిట్, నేతాజీ, బిషప్ అజరయ్య హైస్కూల్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు విద్యార్థులు తయారు చేసిన సైంటిఫిక్ జ్యోతిని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News