-మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పలు ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో జరిగిన పనులను పరిశీలించినారు. నగర పర్యటనలో భాగంగా మంగళవారం కమిషనర్ సర్కిల్ -1 పరిధిలో గల 41 వ డివిజన్ లోని స్మశాన వాటిక నందు నిర్మించిన ప్రహరి గోడను మరియు 39 వ డివిజన్ లోని రైతుబజార్ లో నిర్మించిన బిల్డింగు యొక్క ప్లస్టింగ్ ను మరియు 46 వ డివిజన్ కే.ఎల్.రావు నగర్ లో గల దోభిఖాన ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. అభివృద్ధి పనులల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పూర్తిస్థాయిలో పరిశీలించినారు. అధికారులు నిరంతర పర్యవేక్షణలోనే ఆయా డివిజన్లలో అభివృద్ధి పనులు జరగాలని, పనుల్లో నాణ్యాత ప్రమాణాలు ఉంటేనే గుత్తేదార్లకు బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర అధికారులతో పాటుగా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News