విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ వారు వీధి కుక్కల మీద తగిన చర్యలు తీసుకోవడం జరగనుంది. ప్రస్తుతానికి విజయవాడ నగరంలో సుమారు 30 వేల వీధి కుక్కలు ఉన్నవి. దీనికి గాను 3 ప్రత్యేక వాహనాలు మరియు వీధి కుక్కలను పట్టుకోవడానికి బృందాన్ని ఏర్పాటు చేయడం జరగనుంది.6 నెలల్లో అన్ని వీధి కుక్కలకు రేబిస్ టికా వేయనున్నారని, ప్రస్తుతం రోజుకి 45 జంతు జనన నియంత్రణలు జరుగుతున్నాయి దీనిని 100 చేయనున్నారని నగర కమీషనర్ పేర్కొన్నారు. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల వివరాలు కొరకు బృందాలను ఏర్పాటు చేయనున్నారు. కొన్ని కుక్కల ప్రేమికులు మరియు నివాస కాలనీ ప్రతినిధులతో వీధి కుక్కల నుండి సురక్షిత కొరకు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. హోటల్లు, చేప మాంసం అమ్మేవారు వ్యర్ధాలను సక్రమంగా పారవేయాలని చెర్యలు తీసుకోనున్నారు. నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో మూడు సంచార వాహనం ద్వారా వీధి కుక్కలకు ఏ ఆర్ వి వ్యాక్సిన్ చేయవలెనని కమిషనర్ గారు ఆదేశించినారు రోజుకు 70 ,80 వీధి కుక్కలకు ఏ ఆర్ వి వ్యాక్సిన్ చేయవలెనని చెప్పారు మరియు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న డాగ్ లవర్స్ కుక్కలపై అవగాహన సదస్సు పెట్టి ప్రజలను చైతన్య పరచవలనని ఆదేశించినారు కుక్కలను 2001 యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారి నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగినది. వీధి కుక్కల సమస్యలకు 1800 425 2000 విఎంసి టోల్- ఫ్రీ నెంబర్ మరియు 8181960909 విఎంసి వాట్సప్ నెంబర్ ను సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి మరో ముందడుగు
-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం -ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం …
Prajavartha Online Telugu News