గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కు చెల్లించాల్సిన ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లింపుదార్లకు అనుకూలంగా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని నగర కమీషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, నగరాభివృద్ధికి పన్ను చెల్లింపు కీలకమని, ప్రతి ఒక్కరూ పన్ను బకాయిలు సకాలంలో చెల్లించాలనరు. పన్ను చెల్లింపుకు వీలుగా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటు అదనంగా నగరంలోని భారత్ పేట 140 సచివాలయం, వసంతరాయపురం 148 సచివాలయం, పెద్ద పలకలూరు రోడ్ లోని 106 సచివాలయాల్లో కూడా ప్రత్యేక క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ సచివాలయ కార్యదర్శులు పన్ను బకాయిదార్లకు పన్ను చెల్లింపు పై ఇప్పటికే సమాచారం తెలిపారని, పన్ను చెల్లించని బకాయిదార్లకు నీటి కుళాయిలు, అత్యవసర సేవల నిలుపుదల నోటీసులు, ఆర్.ఆర్. యాక్ట్ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News